టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీదేవికి చేదు అనుభవం
- జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీదేవి
- కుషాయిగూడలో పర్యటన
- వరద సాయంపై నిలదీసిన మహిళలు
తమ కాలనీల్లో మౌలిక వసతులు లేవని, ఎన్నో హామీలు ఇచ్చి వెళ్తున్నారని అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలకు నేతలు నచ్చచెప్పలేకపోతున్నారు. ఈ రోజు మరో అభ్యర్థికి స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అభ్యర్థి బొంతు శ్రీదేవి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నారు.
ఈ రోజు కుషాయిగూడలో పర్యటిస్తూ తమకు ఓట్లు వేయాలని వేడుకున్నారు. అయితే, కుషాయిగూడలో వరద సాయంపై ఆమెను స్థానిక మహిళలు గట్టిగా నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.