అశ్రునయనాలతో అంతిమయాత్ర... ర్యాడ మహేశ్ పాడె మోసిన మంత్రి వేముల, ఎంపీ అర్వింద్
- ఉగ్రవాదులతో జరిగిన పోరులో మహేశ్ వీరమరణం
- ఈ రోజు అంత్యక్రియలు
- భారీగా హాజరైన గ్రామస్థులు
ఆయన గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర కొనసాగగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్ ఆయన పాడె మోశారు. సమీప గ్రామాల ప్రజలు కూడా మహేశ్ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీ కార్తికేయ పర్యవేక్షణలో 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు.