'సుల్తాన్'గా వస్తున్న కార్తీ.. ఫస్ట్ లుక్ ఇదిగో!
- తెలుగులో కూడా మార్కెట్ తెచ్చుకున్న కార్తీ
- బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో 'సుల్తాన్'
- రష్మిక నటిస్తున్న తొలి తమిళ సినిమా
- ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న 'సుల్తాన్'
ఇక కార్తీ చేస్తున్న తాజా చిత్రం పేరు 'సుల్తాన్'. తెలుగు, తమిళ భాషల్లో ఇదే టైటిల్ నిర్ణయించారు. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ లుక్ లో కార్తీ ఫుల్ సీరియస్ గా కనిపిస్తున్నాడు. విలన్ల భరతం పట్టడానికి వచ్చిన వాడిలా రౌద్రాన్ని ప్రదర్శిస్తున్నాడు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'మీరు చూపించే ప్రేమాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.. సుల్తాన్ ఫస్ట్ లుక్ ఇదిగో.. మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా' అంటూ కార్తీ అభిమానులకు ఓ సందేశాన్ని కూడ పెట్టాడు. రష్మిక తొలిసారిగా తమిళంలో నటించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.