సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- దర్శకత్వం చేస్తానంటున్న ముద్దుగుమ్మ
- షూటింగుకి రెడీ అవుతున్న 'ఫైటర్'
- రేపు శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం
* విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత ఈ చిత్రం తదుపరి షూటింగును బ్యాంకాక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంచితే, గత కొన్నాళ్లుగా యూరప్ లో హాలిడే ఎంజాయ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే హైదరాబాదు చేరుకున్నాడు.
* శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును రేపు విజయదశమి రోజున తిరుపతి పట్టణంలో ప్రారంభించనున్నారు. దీనికి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే పేరును పరిశీలిస్తున్నారు.