చట్టపరమైర చర్యలు తీసుకుంటా జాగ్రత్త.. నెటిజన్లపై హీరో ఆమిర్ కూతురు హెచ్చరిక
- నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని ఇటీవల ఐరా పోస్ట్
- ఆ పోస్టుపై అభ్యంతరకర రీతిలో నెటిజన్ల కామెంట్లు
- మండిపడ్డ ఆమిర్ కూతురు
అయితే, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐరా ఖాన్ మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాక, అభ్యంతరకర రీతిలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారిపై ఆమె మండిపడింది. అభ్యంతరకంగా తన పోస్టులకు కామెంట్లు పెడితే వాటిని డిలేట్ చేస్తానని, అదే వ్యక్తి మళ్లీ అలాగే కామెంట్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.