భారత్ కు చెందిన తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా కన్నుమూత
- ముంబయిలోని తన నివాసంలో ఈ ఉదయం మృతి
- ఎనిమిదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న అతైయా
- 2015 నుంచి నడవలేని స్థితికి చేరిన భాను
తన తల్లి భాను గత ఎనిమిదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని, అయితే శస్త్రచికిత్సకు ఆమె నిరాకరించిందని రాధిక వివరించారు. 2015 నుంచి నడవలేని స్థితికి చేరుకున్నారని చెప్పారు. నేటి ఉదయం నిద్రలోనే చనిపోయినట్టు తెలిపారు. భాను అంత్యక్రియలు ముంబయి చందన్ వాడి శ్మశానవాటికలో ఈ మధ్యాహ్నం జరిగాయి.