తమిళ నటులు విజయకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
- పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్
- పోలీసుల ఉరుకులు పరుగులు
- ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో వారిళ్లకు చేరుకుని అణువణువు క్షుణ్ణంగా గాలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూముకు రెండుసార్లు ఫోన్ చేసిన వ్యక్తి ఒకరేనని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. కాగా, గత కొద్ది కాలంగా తమిళనాడులో ఫేక్ బాంబు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి వారి ఇళ్లకు కూడా గతంలో ఫేక్ బాంబు కాల్స్ వచ్చాయి.