దళితులపై ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదు: మాజీ ఎంపీ హర్షకుమార్
- విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
- దళితులపై దాడుల కేసుల్లో న్యాయం జరగడంలేదని ఆవేదన
- కాపులపైనా, ముస్లింలపైనా కేసులు ఎత్తేశారని వెల్లడి
రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేశారని, రిలయన్స్ మాల్స్ పై దాడుల కేసులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని తెలిపారు. కానీ దళితులపై ఉన్న ఒక్క కేసును కూడా ఎత్తివేయలేదని ఆరోపించారు. దళితులపై ఉన్న కేసుల జాబితాను సీఎంకు పంపామని ఆయన వివరించారు.