సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కామెడీ కురిపించే పాత్రలో పూజ హెగ్డే
- దేవా కట్టా దర్శకత్వంలో సాయితేజ్
- ఊర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' షూటింగ్ పూర్తి
* సాయితేజ్ హీరోగా నటించే 14వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ ద్వితీయార్థం నుంచి షూటింగ్ జరుగుతుందని దేవా కట్టా తెలిపారు.
* బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రధానపాత్రధారిగా తెలుగులో రూపొందుతున్న 'బ్లాక్ రోజ్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 17న ప్రారంభమైన షూటింగును సింగిల్ షెద్యూలులో పూర్తిచేశారు. నూతన దర్శకుడు మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది స్క్రిప్టును సమకూర్చారు.