ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి అప్ డేట్!
- 'ఆదిపురుష్'కు ఏఆర్ రెహ్మాన్ సంగీతం
- చర్చలు కొనసాగుతున్నాయని ప్రచారం
- రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా హిందీ, తెలుగు సహా ఐదు భాషల్లో తెరకెక్కబోతోంది.