Adipurush: 'ఆదిపురుష్'లో తన క్యారెక్టర్ పై ప్రభాస్ స్పందన!

  • ప్రతి పాత్ర వెనుకా ఎన్నో సవాళ్లు
  • ఇటువంటి క్యారెక్టర్ దక్కడం గర్వకారణం
  • యువత చిత్రాన్ని ఆదరిస్తుందన్న నమ్మకముందన్న ప్రభాస్
Prabhas Comments on Adi purush Cahrecter

తన కొత్త చిత్రం టైటిల్ 'ఆదిపురుష్'పై హీరో ప్రభాస్ స్పందించారు. "ప్రతి పాత్ర, ప్రతి అవకాశం వెనుక ఎన్నో సవాళ్లుంటాయి. కానీ, ఈ తరహా క్యారెక్టర్ ను పోషించడం ఎంతో గర్వకారణం. బాధ్యతగా చేయాల్సిన పాత్రిది. ఈ పాత్రను పోషించేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను. ఈ క్యారెక్టర్ ను ఓమ్ డిజైన్ చేసిన తీరు అద్భుతం. దేశ యువత, ఈ చిత్రాన్ని ఆదరిస్తుందన్న నమ్మకం నాకుంది" అని ప్రభాస్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఉదయం 7.30 గంటల సమయంలో చిత్రం టైటిల్ ను ప్రభాస్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News