అజ్ఞాతం వీడిన రియా చక్రవర్తి.. ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షం!
- సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాపై ఆరోపణలు
- సుశాంత్ అకౌంట్ల నుంచి తరలిన డబ్బు
- ఈడీ విచారణకు హాజరైన రియా
అయితే, సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరింది. అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, ఈరోజు 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఆమె హాజరైంది.