శిరోముండనం బాధితుడితో కలిసి నిరసన దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్
- వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం
- తన నివాసంలో ఒక రోజు దీక్షకు దిగిన హర్షకుమార్
- వైసీపీలోని దళిత సంఘాలు కూడా మద్దతు పలకాలని విజ్ఞప్తి
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే కూర్చుని ఈ దీక్షకు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శిరోముండనం వ్యవహారంలో అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల కాల్ డేటాను పరిశీలించాలని అన్నారు. ఈ పోరాటంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీలోని దళిత సంఘాలు కూడా మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీలో దళితులపై అఘాయిత్యాలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తానని మాజీ ఎంపీ తెలిపారు.