కేటీఆర్‌పై ప్రత్యేక వీడియో పోస్ట్ చేసిన సినీనటుడు ప్రకాశ్ రాజ్
- కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
- విపత్తు వచ్చినప్పుడు ప్రజల కోసం కేటీఆర్ నిలబడతారు
- నాయకుడంటే అలా ఉండాలి
- శ్రామికులను దేశాభివృద్ధి భాగస్వాములుగా ఆయన భావిస్తారు
కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. శ్రామికులను దేశాభివృద్ధి భాగస్వాములుగా భావిస్తూ వారి కష్టాలను తీర్చుతూ కేటీఆర్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన వీడియోలో ఉంది. ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించిన కార్యక్రమాలకి సంబంధించిన దృశ్యాలను ప్రకాశ్ రాజ్ చూపించారు. ప్రజలకు కేటీఆర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. నాయకుడంటే ఎలా ఉండాలో కేటీఆర్ నిరూపిస్తున్నారని ప్రశంసించారు.