వెబ్ సీరీస్ కోసం కాజల్ మరింత గ్లామర్!
- వెబ్ సీరీస్ కి మళ్లిన కాజల్ అగర్వాల్
- ప్రియాంక చోప్రా నటించిన క్వాంటికో సీరీస్
- క్వాంటికో ఇండియన్ వెర్షన్ లో కాజల్
ఆమధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో 'క్వాంటికో' అనే సీరీస్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అందులో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది కూడా. అలాగే ఆమె పెర్ఫార్మెన్స్ కి అక్కడ మంచి ప్రశంసలు కూడా లభించాయి. ఈ వెబ్ సీరీస్ అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీనికి ఇండియన్ వెర్షన్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. సో.. ఈ సీరీస్ ద్వారా కాజల్ మరింత గ్లామర్ ని కురిపిస్తుందన్న మాట!