వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష!
- వెబ్ సీరీస్ కి మొగ్గు చూపుతున్న హీరోయిన్లు
- ఇప్పటికే చేస్తున్న కాజల్, సమంత
- ఆనంద వికటన్ నిర్మించే వెబ్ సీరీస్ లో త్రిష
ఇప్పటికే కాజల్, సమంత వంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతోంది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తారు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందుతుందట.