సుశాంత్ ఆత్మహత్య కేసు.. నటి సంజన సంఘీని విచారించిన పోలీసులు
- గత నెల 14న ఆత్మహత్య చేసుకున్న సుశాంత్
- దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
- ఇప్పటి వరకు 28 మంది వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు
సుశాంత్ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ సహా మొత్తం చిత్ర పరిశ్రమను సుశాంత్ ఆత్మహత్య కదిలించింది. అతడి మరణానికి నెపోటిజమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. బంధుప్రీతి కారణంగా టాలెంట్ ఉన్నప్పటికీ ఇతరులకు అవకాశాలు లభించడం లేదంటూ మండిపడిన నెటిజన్లు.. సుశాంత్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న వారిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. అంతేకాదు, మరికొందరు సెలబ్రిటీలు స్వయంగా సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. కరణ్ జొహార్ అయితే చాలామందిని అన్‌ఫాలో చేసి, కేవలం 8 మందిని మాత్రమే ఫాలో అవుతుండడం గమనార్హం.