Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • తమన్నాకు ఎపిసోడ్ కు 8 లక్షలు!
  • సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్
  • బెల్లంకొండ 'అల్లుడు అదుర్స్' అప్ డేట్   
Thamanna paid huge remuneration for Talk Show

*  కథానాయిక తమన్నా త్వరలో 'ఆహా' ఓటీటీ ప్లేయర్ కోసం ఓ టాక్ షో చేయనుంది. ఇందుకోసం ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు ఎనిమిది లక్షల రూపాయల పారితోషికం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ టాక్ షో లో పలువురు స్టార్లు పాల్గొంటారు.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగును తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ప్రారంభిస్తారు. అయితే, రజనీకాంత్ అప్పుడే షూటింగులో పాల్గొనరు. దాంతో ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.
*  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News