మహేశ్ నిర్మిస్తున్న చిత్రంలో రేణు దేశాయ్?
- సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న రేణు
- మహేశ్ బ్యానర్లో అడివి శేష్ హీరోగా 'మేజర్'
- చిన్న పాత్రే అయినా కీలక పాత్రకు రేణు
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ, చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలు వున్నాయని అంటున్నారు.