సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరోసారి పల్లెటూరి పిల్లగా సాయిపల్లవి
- డిసెంబర్ నుంచి నయన్, సమంత చిత్రం
- గుణశేఖర్ 'హిరణ్య కశ్యప' అప్ డేట్
* అందాల తారలు నయనతార, సమంత కలసి తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును డిసెంబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిని తెలుగులో కూడా ఏకకాలంలో నిర్మిస్తారు.
* ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో 'హిరణ్యకశ్యప' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు పూర్తి చేసినట్టు సమాచారం. రానా డేట్స్ ను బట్టి సెట్స్ కి వెళతారట. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది.