ఇకపై చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేది లేదు: నటి సాక్షి అగర్వాల్
- చైనా తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు
- చైనా వస్తువులు వాడొద్దంటూ ప్రచారం
- మన దేశం శాంతి, సహనానికి చిరునామా అన్న సాక్షి
మన సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోందన్న నటి.. శాంతికి, సహనానికి భారతదేశం చిరునామా అని పేర్కొంది. మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకే మన సైన్యంపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తీరుకు నిరసనగా ఆ దేశ ఉత్పత్తులను వినియోగించకపోవడమే కాకుండా, ఆ దేశ ఉత్పత్తుల ప్రకటనల్లోనూ నటించబోనని స్పష్టం చేసింది.