సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'సీటీమార్' షూటింగ్ అప్ డేట్
- ఎన్టీఆర్ సినిమాకి ముహూర్తం
- నితిన్ సరసన నభా నటేష్
* ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగును విజయదశమి సందర్భంగా అక్టోబర్ ఒకటిన ప్రారంభించడానికి నిర్ణయించినట్టు సమాచారం. దీనికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ని అనుకుంటున్నారు.
* ప్రస్తుతం 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్న నితిన్ దీని తర్వాత 'అంధాదూన్' హిందీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా 'ఇస్మార్ట్ శంకర్' ఫేం నభా నటేష్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తారు.