Tollywood: రేపు సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు

  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ
  • ఏపీ సీఎంతో భేటీకి చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్, జీవిత రాక
  • షూటింగులు, థియేటర్ల అంశంపై చర్చించే అవకాశం
Tollywood celebrities set to meet AP CM Jagan

ఇప్పటికే కొన్నినెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు రేపు ఏపీ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, జీవిత తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు, మరికొన్ని సమస్యలపై వారు సీఎంతో చర్చించనున్నారు.  

More Telugu News