బాలకృష్ణను ఆహ్వానించాల్సిన బాధ్యత 'మా'దేనని సి. కల్యాణ్ వ్యాఖ్యానించడం దారుణం: నరేశ్
- టాలీవుడ్ లో మరో వివాదం
- సీఎం కేసీఆర్ తో సినీ ప్రముఖుల సమావేశం
- తనను పిలవకపోవడంపై బాలయ్య కినుక!
అయితే, ఈ వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్ ఖండించారు. బాలయ్యను పిలవాల్సింది 'మా'నే అంటూ సి.కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. మా అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకు ఈ సమావేశాలు జరుగుతున్న సంగతే తెలియదని, తనకే కాదు, మా ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విషయం తెలియదని, తమకే తెలియనప్పుడు మరొకరిని ఈ సమావేశాలకు ఎలా ఆహ్వానిస్తామని నరేశ్ ట్వీట్ చేశారు.