టూరిజం ఓపెన్... గోవా సంచలన నిర్ణయం!
- లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన గోవా
- 17 తరువాత పరిమితులతో పర్యాటకులకు అనుమతి
- మహారాష్ట్ర, కర్ణాటక వాసులను అనుమతించబోము
- స్వయంగా వెల్లడించిన సీఎం ప్రమోద్ సావంత్
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, పక్కనే సరిహద్దులను పంచుకుంటున్న కర్ణాటక వాసులు మినహా మిగతా రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి పర్యాటకులు రావచ్చని పేర్కొంది. కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలని, పరిమితులు కూడా విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే వారిని పరిమిత సంఖ్యలో అయినా, రైలు, విమాన, అంతర్రాష్ట్ర రోడ్డు మార్గాల ద్వారా అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఈ నెల 17 తరువాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గోవాను తిరిగి తెరుస్తామని, విధించిన నిబంధనలు పాటిస్తూ, కొన్ని పరిమితుల్లో పర్యాటకులను అనుమతించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.