బోయపాటి సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరో
- బాలకృష్ణతో బోయపాటి మూడో మూవీ
- మరోసారి తొట్టెంపూడి వేణుకు అవకాశం
- బాలయ్య జోడీగా కొత్త కథానాయిక పరిచయం
గతంలో ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'దమ్ము' సినిమాలోను వేణు ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఆయనకి బోయపాటి అవకాశం ఇచ్చాడు. డైలాగ్స్ ను ఫాస్టుగా చెప్పే హీరోగా వేణుకి మంచి గుర్తింపు ఉండేది. బోయపాటి సినిమాలో ఆయన పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ద్వారా బోయపాటి కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తుండటం విశేషం. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం.