నమ్మక తప్పదు... ఇతను మన ఎంఎస్ ధోనీయే!
- లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం
- కుమార్తెతో ఆడుకుంటున్న చిత్రాలు సోషల్ మీడియాలో
- తెల్ల గడ్డం పెరిగిపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం
ఇక, తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ధోనీ, తన కుమార్తె జీవాతో ఆటాడుకుంటూ, ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, ధోనీ పోస్ట్ చేసిన వీడియో, ఫ్యాన్స్ కు షాకిస్తోంది.
తెల్లగడ్డంతో గుర్తు పట్టలేని విధంగా ధోనీ కనిపిస్తున్నారు. ఫిట్ నెస్ కూడా కొంత తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఇక నాటి జులపాల జుట్టు కుర్రాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడేంటని ఈ ఫోటో చూసిన వారంతా కామెంట్లు పెడుతున్నారు.