సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- యాంకరింగులో పోటీ గురించి రష్మి
- వక్కంతం దర్శకత్వంలో రవితేజ
- పారితోషికాన్ని తగ్గించుకున్న నటుడు
* 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంతం వంశీ ఆ సినిమా పరాజయం పాలవడంతో వెనుకపడ్డాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుందట.
* కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అలాగే సినిమా రంగం కూడా బాగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు' ఫేం, నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంథోనీ తన పారితోషికాన్ని 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా విజయ్ ను కోలీవుడ్ నిర్మాతలు అభినందిస్తున్నారు.