13 B హారర్ థ్రిల్లర్ సీక్వెల్లో చైతూ
- తమిళంలో హిట్ కొట్టిన '13 B'
- తెలుగులోను విజయవంతం
- సీక్వెల్ కి సన్నాహాలు
ఈ నేపథ్యంలో ఈ సారి విక్రమ్ కుమార్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో తమిళంలో ఘన విజయాన్ని సాధించిన '13 B' అనే హారర్ థ్రిల్లర్ కి ఈ సినిమా సీక్వెల్ అని తెలుస్తోంది. 2009లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమా, తెలుగులోను విజయాన్ని అందుకుంది. కథాకథనాల పరంగా ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మాధవన్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా సీక్వెల్లోనే ఇప్పుడు చైతూ చేయనున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.