రామ్ 'రెడ్' మూవీ డిజిటల్ రైట్స్ కోసం గట్టిపోటీ
- రామ్ నుంచి మాస్ యాక్షన్ మూవీ
- లాక్ డౌన్ కారణంగా విడుదల ఆలస్యం
- ఐటమ్ సాంగులో హెబ్బా పటేల్
నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయట. అయితే స్రవంతి మూవీస్ వారు ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలనే బలమైన నిర్ణయంతో వున్నారు. దాంతో థియేటర్స్ లో విడుదలైన తరువాతైనా ఆ సినిమా డిజిటల్ రైట్స్ తమకి ఇవ్వమంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయట. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, హెబ్బా పటేల్ ఒక ఆ ఐటమ్ లో మెరవనుంది.