అప్పట్లో నన్ను చూసి కమలహాసన్ అనుకునేవారు: నిర్మాత సురేశ్ బాబు
- మొదటి నుంచి బిజినెస్ విషయాలంటే ఇష్టం
- నటన పట్ల ఆసక్తి వుండేది కాదు
- భారతీరాజా ఆఫర్ ను తిరస్కరించానన్న సురేశ్ బాబు
"మంచి వయసులో ఉండగా నేను కమలహాసన్ లా ఉండేవాడిని. ఆయన కారు .. నా కారు ఒకే రకమైనవి. అందువలన నేను ఆ కారులో వెళుతుంటే కమల్ అనుకుని అభిమానులు నా కారు ఆపేసేవారు. ఇక భారతీరాజా గారు నాతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన ఆఫర్ ను నేను సున్నితంగా తిరస్కరించాను. మొదటి నుంచి కూడా నాకు నటన పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందువలన నటనకు దూరంగానే వుండిపోయాను. బిజినెస్ వ్యవహారాల పట్లనే మక్కువ ఎక్కువగా ఉండేది. అందువల్లనే నిర్మాతగా స్థిరపడ్డాను" అని చెప్పుకొచ్చారు.