ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు... మూడో అతిపెద్ద హాట్ స్పాట్ ఇదే!
- తుగ్లకాబాద్ లో ఒక్కసారిగా బయటపడిన కొత్త కేసులు
- మొత్తం ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు
- అతిపెద్ద హాట్ స్పాట్ గా నిజాముద్దీన్, ఆపై చాందినీ మహల్
దీంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలనూ సేకరించి, వారిని క్వారంటైన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది.