స్క్రిప్టులో మార్పులు చేస్తున్న బోయపాటి!
- బాలకృష్ణతో బోయపాటి మూడో సినిమా
- ద్విపాత్రాభినయం చేయనున్న బాలకృష్ణ
- అఘోర పాత్ర నిడివిని తగ్గిస్తున్న బోయపాటి
బాలకృష్ణ అఘోర పాత్రకి డైలాగ్స్ తక్కువగా వుంటాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర విషయంలో బాలకృష్ణ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారట. బోయపాటి సన్నిహితులు కూడా, అఘోర పాత్రను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకంటారోననే సందేహాన్ని వ్యక్తం చేశారట. దాంతో బోయపాటి ఆ పాత్ర నిడివిని తగ్గించి, అఘోరగా బాలకృష్ణ తెరపై తక్కువ సేపు కనిపించేలా స్క్రిప్టులో మార్పులు చేసుకుంటున్నాడని సమాచారం.