ఆ ప్రాజక్టుకి చైతూను ఒప్పించిన సమంత!
- 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన నందినీ రెడ్డి
- సమంతతో మంచి సాన్నిహిత్యం
- త్వరలోనే మిగతా వివరాలు
ఆ మధ్య సమంతతో నందినీ రెడ్డి 'ఓ బేబీ' సినిమా చేసి హిట్ ఇచ్చింది. సమంత కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి కూడా సమంత - నందినీ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన నందినీ రెడ్డి ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో చైతూను సమంత ఒప్పించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగానే వున్నాడు. అయినా సమంత రిక్వెస్ట్ ను కాదనలేక ఆయన ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.