భారీ విరాళం ప్రకటనకు ముందు.. అక్షయ్‌తో జరిగిన సంభాషణను బయటపెట్టిన ట్వింకిల్ ఖన్నా!
- పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం
- అంత మొత్తం ప్రకటిస్తే ఎలా అని ప్రశ్నించిన ట్వింకిల్
- కెరియర్ ప్రారంభంలో తన వద్ద చిల్లిగవ్వ లేదని అక్షయ్ సమాధానం
పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్లు ప్రకటించిన అక్షయ్ తనను గర్వపడేలా చేశాడని పేర్కొన్న ట్వింకిల్.. మరీ అంతమొత్తంలో ప్రకటిస్తే ఎలా అని, మనకి కూడా డబ్బులు అవసరం కదా అని ప్రశ్నించానని తెలిపింది. దీనికి అక్షయ్ బదులిస్తూ.. తాను కెరియర్ ప్రారంభించినప్పుడు తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని, కానీ ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశాడని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయకుండా ఉండలేనని అన్నాడని ట్వింకిల్ తెలిపింది.