తెలుగు సినిమాలు చేయనని ఎవరితోనూ చెప్పలేదు: హీరోయిన్ త్రిష
- తెలుగు సినిమానే నన్ను నిలబెట్టింది
- పుకార్లను నమ్మకండి
- మలయాళ సినిమాలతో బిజీగా వున్నానన్న త్రిష
ఈ నేపథ్యంలో త్రిష తెలుగు సినిమాలు చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ .. "నేను హీరోయిన్ గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో. అలాంటప్పుడు తెలుగు సినిమాలు చేయనని ఎందుకంటాను? ఆ మధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. దాంతో తెలుగులోనే చేయదట అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పడమే నా ఉద్దేశం. ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగానే వున్నాను" అని ఆమె చెప్పుకొచ్చింది.