సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అజయ్ సరసన మరోసారి రకుల్
- తమిళ చిత్రంలో శర్వానంద్
- అజిత్ తో సుధ కొంగర సినిమా
* చాలా కాలం గ్యాప్ తర్వాత శర్వానంద్ మళ్లీ ఇప్పుడు తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వం వహించే చిత్రంలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* తమిళనాట రాణిస్తున్న లేడీ డైరెక్టర్ సుధ కొంగర తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరో అజిత్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆమె వినిపించిన కథ అజిత్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, జూలై నుంచి ఈ ప్రాజక్టు పట్టాలెక్కుతుందని సమాచారం.