చాలా బాధాకరం.. మా పిల్లలు ఇలా జీవించాల్సి వస్తోంది!: సన్నీ లియోన్
- తన భర్త, పిల్లల ఫొటోలు పోస్ట్ చేసిన సన్నీ
- మాస్కులు ధరించిన ఆమె కుటుంబం
- ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరన్న సన్నీ
'ఇదో కొత్త శకం! మా పిల్లలు ఇప్పుడు ఇలా జీవించాల్సి వస్తుండడం చాలా బాధాకరం.. కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాస్కులు ఎలా ధరించాలన్న విషయంపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను' అని ఆమె తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఇప్పటికే పలుసార్లు తెలిపింది. తన భర్తతో కలిసి ముఖానికి మాస్కులు ధరించిన ఫొటోలను షేర్ చేసింది.