Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Thamanna takes much care for her latest flick

  • తెలంగాణ యాస నేర్చుకున్న తమన్నా 
  • మెగా హీరో చిత్రంలో కన్నడ నటుడు 
  • టీవీ షోకి నాగార్జునకు భారీ పారితోషికం

 *  ప్రస్తుతం తాను నటిస్తున్న 'సీటీమార్' చిత్రం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అంటోంది అందాలభామ తమన్నా. 'ఇందులో తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రను చేస్తున్నాను. ఇందుకోసం తెలంగాణ యాస నేర్చుకున్నాను. అలాగే ఫిట్ గా కనిపించడం కోసం పూర్తి శాకాహారిగా మారాను' అని చెప్పింది.
*  ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర చేయడానికి ఓకే చెప్పాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'బాక్సర్' చిత్రంలో ఉపేంద్రను ఓ ముఖ్య పాత్రకు తీసుకున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ త్వరలో హైదరాబాదులో జరుగుతుంది.
*  తెలుగు టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 4కి హోస్ట్ గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అక్కినేని నాగార్జునను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయనకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట.

 

Thamanna
Upendra
Varun Tej
Nagarjuna
Bigg Boss
  • Loading...

More Telugu News