ఫస్టు షెడ్యూల్ పూర్తిచేసిన వరుణ్ తేజ్
- బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- 35 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
క్రితం నెల 24వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. అలా రెండు వారాల పాటు ఏకధాటిగా సాగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. వరుణ్ తేజ్ .. ముఖ్య పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. త్వరలోనే మరో షెడ్యూల్ ను ఆరంభించనున్నారు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుండటం విశేషం.