'రెడ్' నుంచి ఫస్టు సాంగ్ వచ్చేస్తోంది
- రామ్ తాజా చిత్రంగా 'రెడ్'
- కిషోర్ తిరుమలతో మూడో సినిమా
- ఈ నెల 6న ఫస్టు సాంగ్ రిలీజ్
మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మాళవిక శర్మ .. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. గతంలో రామ్ .. కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన 'నేను శైలజ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.