'ఓ పిట్టకథ' నుంచి యూత్ ఫుల్ సాంగ్
- మరో ప్రేమకథా చిత్రంగా 'ఓ పిట్టకథ'
- దర్శకుడిగా చెందు ముద్దు
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
"ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో .. నన్ను తాకినట్టు వుంది మాయే ఏదో ఏదో ఏదో. అందమైన మాటకు అర్థమేదో ..ఊహతో రెచ్చగొట్టు భావమేదో" అంటూ ఈ పాట సాగుతోంది. తొలిసారి ప్రేమలోపడిన ఒక యువకుడు, తన ప్రియురాలితో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలను ఊహించుకుంటూ పాడే ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం .. శ్రీజో సాహిత్యం .. స్వీకర్ అగస్తి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రేమకథ చిత్రం యూత్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.