బెల్లంకొండ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తాడట
- సంతోష్ శ్రీనివాస్ తో బెల్లంకొండ
- ప్రతినాయకుడిగా సోనూ సూద్
- రామ్ లక్ష్మణ్ ఫైట్స్ హైలైట్
'కందిరీగ'లో రామ్ మాదిరిగానే ఈ సినిమాలో బెల్లంకొండ పాత్ర పూర్తి ఎనర్జిటిక్ గా వుంటుందట. ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు వున్నారు. నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రలు అదే తరహాలో సందడి చేస్తాయట. ఇక 'కందిరీగ'లో విలన్ గా చేసిన సోనూ సూద్, ఈ సినిమాలోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట. యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనున్నాయని అంటున్నారు. మొత్తానికి బెల్లంకొండను సంతోష్ శ్రీనివాస్ కొత్తగా చూపించనున్నాడన్న మాట.