నూజివీడు జనసేన నేత భాస్కరరావు మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం
- ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
- మరణ వార్త వినగానే ఎంతో బాధ కలిగిందన్న పవన్
- సౌమ్యశీలి, మృదు స్వభావుడిని కోల్పోయామంటూ వ్యాఖ్య
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం భాస్కరరావు మరణించారనే వార్త విన్న వెంటనే ఎంతో బాధ అనిపించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. సౌమ్యశీలి, మృదు స్వభావుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కరరావుకు తన తరపున, జనసైనికుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.