హీరో ధనుష్‌ను చంపేస్తామంటూ బెదిరింపుల కలకలం
- 'కర్ణన్' సినిమాలో నటిస్తున్న ధనుష్
- కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్షణల ఆధారంగా కర్ణన్?
- హీరో, దర్శకుడు తలలు నరుకుతామని బెదిరింపులు
ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటికే నడిగర్ తిలగం శివాజీ గణేశన్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్‌స్టేషన్‌కు మణియాచ్చి అని పేరు కూడా పెట్టారంటూ మండిపడుతున్నారు. ఆ పీఎస్‌ను నటుడు ధనుష్ ధ్వంసం చేసే సన్నివేశం ఉందని అంటున్నారు.
ఇటువంటి అభ్యంతరకర సీన్ తీసిన దర్శకుడు మారి సెల్వరాజ్‌తో పాటు నటించిన ధనుష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. తమ సామాజిక వర్గం గురించి తప్పుగా చిత్రీకరిస్తే తలలు నరుకుతామని ఓ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడని తెలుస్తోంది. ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్‌లకు వార్నింగ్ ఇచ్చాడని సమాచారం.