త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను.. ఇంకా షాక్‌లో ఉన్నాను: హీరోయిన్ కాజల్
- నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు
- ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను
- ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది
'నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. నిన్నటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంపై నేనింకా షాక్ లోనే ఉన్నాను. త్రుటిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను. ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది' అని తెలిపింది. కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.