హీరో కోసం పోటీపడే నాయికలుగా నయనతార, సమంత
- విఘ్నేశ్ శివన్ నుంచి వినోదభరిత చిత్రం
- వచ్చేనెలలో సెట్స్ పైకి
- త్వరలోనే మిగతా వివరాల వెల్లడి
పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతుంది. కథానాయికలుగా సమంత - నయనతార కనిపించనున్నారు. హీరో కోసం పోటీపడే కథానాయికలుగా, ఆయన కోసం ఫైటింగులు గట్రా చేసుకునే నాయికలుగా ఈ సినిమాలో సమంత - నయనతార కనిపిస్తారట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మిగతా విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.