పవన్ కోసం పవర్ఫుల్ టైటిల్ .. 'విరూపాక్ష'
- చారిత్రక నేపథ్యంలో క్రిష్ సినిమా
- బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్
- కథానాయిక విషయంలో రావాల్సిన స్పష్టత
ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కనుక, 'విరూపాక్ష' అనే టైటిల్ ను క్రిష్ పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానీని, ఆ తరువాత పూజా హెగ్డేని సంప్రదించగా, డేట్లు ఖాళీ లేవన్నారనే వార్తలు వినిపించాయి. పవన్ నుంచి రానున్న తొలి చారిత్రక చిత్రం కావడంతో, అభిమానులందరిలోను ఆసక్తి వుంది.