ఛైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ప్రమాణ పత్రాలు చించేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అరెస్టు
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం
- ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని దాడి
- కేసీఆర్‌పై మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ నేపథ్యంలో వారిని ఆయన అడ్డుకున్నారు. అలాగే, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని, ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో లాఠీచార్జ్ జరిగింది.