'ఎవరు' డైరెక్టర్ తో దిల్ రాజు ప్రాజక్ట్
- 'ఎవరు'తో హిట్ ఇచ్చిన వెంకట్ రాంజీ
- కొత్త కథతో 'దిల్' రాజు దగ్గరికి
- ఒక కథానాయకుడిగా మెగా హీరో
'ఎవరు' సినిమాతో హిట్ కొట్టిన వెంకట్ రాంజీ వినిపించిన కథ నచ్చడంతో, నిర్మాతగా 'దిల్' రాజు రంగంలోకి దిగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ మల్టీ స్టారర్ కథలో ఒక మెగా హీరో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో హీరోను కూడా ఎంపిక చేసుకుని డేట్స్ ఓకే చేసుకుంటే, ఆ తరువాత పనులు చకచకా జరిగిపోతాయని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.